మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. ఆయన గత కొంతకాలంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఆ సీటును టిడిపికి కేటాయించింది.దాంతో కార్తీక్ రెడ్డికి అవకాశం దక్కడం లేదు.రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ బుధవారం ప్రకటించారు. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తాలను అభ్యర్థులుగా ఆయన తెలిపారు. సనత్‌నగర్ కూడా టీడీపీకే దక్కబోతున్నట్లు, కూన వెంకటేశ్‌గౌడ్ పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. tags : tdp,kartikreddy