A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కు గుడ్ బై
Share |
December 11 2018, 2:18 am

తెలంగాణ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్దిగా రంగంలో దిగడానికి సిద్దం అవుతున్నారు.మరో వైపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.ముధోల్‌ నియోజకవర్గ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు టికెట్‌ రాకపోవడంతో ఆయన గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఎన్సీపీ నుంచి ఆయన ముధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని చెబుతున్నారు.జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ తార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం శ్రమిస్తే పార్టీ పట్టించుకోలేదనీ, టికెట్ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నానని ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు మొదట టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పారని, అనంతరం మొండిచేయి చూపారని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

tags : congress, goodbye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info