A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
Share |
May 24 2019, 4:31 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరి తాను మాట్లాడలేనని, ఆయనలా తాను కంప్యూటర్ ను కనిపెట్టలేదని మంత్రి కెటిఆర్ ఎద్దేవ చేశారు. మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడారు.చంద్రబాబులా హైదరాబాద్‌ నేనే కట్టాను.. హైకోర్టు భవనం నేనే కట్టాను..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టాను.. అంటే ప్రజలు నవ్వుతారని ఆయన అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఒక్క వైఎస్సార్‌సీపీతో మాత్రమే పొత్తు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనకాడరని అన్నారు. 100 పైగా సీట్లలో బీజేపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. తాను మంత్రిని అవుతానని జీవితంలో అనుకోలేదని, ఈ మంత్రి పదవే తనకు ఎక్కువ అని, కేసీఆర్‌ లాంటి నాయకులు రాష్ట్రాన్ని నడపాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరో 15 సంవత్సరాలు కేసీఆర్‌యే సీఎంగా ఉండాలనేదే తన కోరికన్నారు.

tags : ktr, babu, computer

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info