A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
Share |
December 11 2018, 12:05 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు పెద్దగా తేడా కనిపించడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.పవన్ కళ్యాణ్ అర్దం లేకుండా మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.వైఎస్ ను ఎదిరించానని చెబుతున్న పవన్ కళ్యాణ్ అసలు అపుడు జకీయాలలో ఉన్నారా అని ప్రశ్నించారు.కులాలతో సంబంధం లేందంటూనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కులాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. . చంద్రబాబులాగే పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు.వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న విషయంలో పవన్‌ చంద్రబాబులాగే మాట్లాడుతున్నారని బొత్స పేర్కొన్నారు. అధికార పార్టీ డైరెక్షన్‌లో పవన్‌ నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖాళీగా ఉన్నప్పుడే వచ్చి విమర‍్శలు చేయడం కాదు ప్రజల తరపున పోరాడాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాడారు.. అలాంటి కార్యక్రమం పవన్‌ చేశారా అని ప్రశ్నించారు.

tags : botsa, chandrababu,pawnakalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info