A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
Share |
December 11 2018, 1:13 am

తెలంగాణలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి కెటిఆర్ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడారు. సంక్షేమానికి ఇది స్వర్ణయుగంగా మార్చడం జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఉద్యమ నేతగానే కాకుండా మంచి పాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ ఒన్ స్టేట్ గా మార్చామని ఆయన తెలిపారు.పలు దీర్ఘకాలిక శాశ్వత ప్రాజెక్టులు చేపట్టామని ఆయన అన్నారు. విభజన సమయంలో ఉన్న అపోహలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన అన్నారు. ఇసుక ద్వారా నాలుగున్నర ఏళ్లలో పారదర్శకమైన విధానం ద్వారా సంవత్సరానికి 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు.అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏడాదికి నాలుగు కోట్లే వచ్చిందని ఆయన అన్నారు.తెలంగాణ పాలనను వివిధ రాష్ట్రాల వారు వచ్చి మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఐటి రంగంలో జాతీయ సగటు కన్నా ముందు ఉన్నామని కెటిఆర్ చెప్పారు.

tags : ktr, kcr, ruler

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info