A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
Share |
May 24 2019, 5:18 am

కరెంట్‌ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్‌, టీడీపీ ఓ గట్టున, 24గంటలు కరెంట్‌ ఇచ్చిన టీఆర్‌ఓస్‌ మరో గట్టున ఉందన్నారు. సత్తుపల్లి నాగన్నలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం మరల అమలులోకి వచ్చిన తర్వాత రైతు బంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతామన్నారు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు కావాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. రాహుల్‌ గాంధీ సీట్లు ఇచ్చినా, చంద్రబాబు నోట్లు ఇచ్చినా, టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేసి కూటమికి బుద్ధి చెప్పాలని కోరారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్‌ఎస్‌ స్వీట్లు పంచుకుంటుందని ఆయన అన్నారు.తెలంగాణ ప్రాజెక్టులు ఆడ్డుకున్న నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం కూటమిగా వస్తున్నారని, ప్రజలంతా వారికి గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కోరారు.

tags : sattupalii,ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info