మహాకూటమి సీట్ల పంపకం గందరగోళంగా మారుతోంది. రాజేంద్రనగర్ సీటును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు ఆశిస్తుండగా, ఆయనకు కాకుండా టిడిపికి కేటాయించారు. ఇబ్రహింపట్నం సీటు మరీ చిత్రంగా మారింది. టిడిపి నేత సామా రంగారెడ్డి ఎల్బినగర్ సీటు కోసం ఎన్.టి.ఆర్.ట్రస్టు వద్ద ఆందోళనలు చేస్తే,ఆయనకు ఇబ్రహింపట్నం టిక్కెట్ ఇచ్చారు.దాంతో ఆయన ఏమి చేయాలో తోచక సతమతం అవుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్లు కోరుకున్న మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి,కాంగ్రెస్ నేత మల్లేష్ లు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు. మల్ రెడ్డి బిజిపి పక్షాన పోటీ చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.క్యామ మల్లేష్ కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సమాలోచనలు చేస్తున్నారు. టిక్కెట్ పొందిన సామా రంగారెడ్డి కూడా సంతోషంగా లేరు. దీనిపై అమరావతి వెళ్లి చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని ఆయన చెబుతున్నారట.
11 ఏళ్ల నుంచి టీడీపీని ఎల్బీనగర్లో బలోపేతం చేశానని సామ రంగారెడ్డి మీడియాతో తెలిపారు. ఎల్బీనగర్లో ఏ వార్డులోనూ కాంగ్రెస్కు టీడీపీ కంటే ఆధిక్యం రాదని అన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ తనకు రావడంతో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. tags : tdp,tickets