ఉత్కంఠ రేకెత్తించిన ఖైరతాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ టిక్కెట్ ను మాజీ మంత్రి దానం నాగేందర్ కే దక్కిందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పార్టీ అద్యక్షుడు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కదనం. గత కొన్నాళ్లుగా ఈ సీటు ఎవరికి కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. కాగా మేడ్చల్ ను ఎమ్.పి మల్లారెడ్డికి, మల్కాజిగిరి ని ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావుకు ఇచ్చారు.వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మేయర్ నరేంద్రకు కేటాయించారు.ముషీరాబాద్ సీటును ముఠా గోపాల్ కు ఇచ్చారు. ఇక్కడ హోం మంత్రి నాయిని తన అల్లుడుకోసం పట్టుబట్టారు. tags : danam, khiratabab