గత ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలలో 67 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలంగాణ ఎన్నికల నిఘా , ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపాయి.ఆ సంస్థలు దీనిపై ఒక నివేదికను తయారు చేశాయి. దాని ప్రకారం రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో67 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.అందులో 47 మంది సీరియస్ కేసులు ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందిలో 41 మందిపై, కాంగ్రెస్ నుంచి గెల్చిన 21 మందిలో ఏడుగురిపై, టీడీపీ నుంచి గెలుపొందిన 15 మందిలో తొమ్మిదిమందిపై, ఎంఐఎం నుంచి ఏడుగురు గెలిేస్త వారిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసు ఉంది. మరో స్వతంత్ర ఎమ్మెల్యేపైనా క్రిమినల్ కేసు నమోదై ఉంది.అయినా ప్రజలు వీటిని పట్టించుకోవడం లేదు కదా! tags : telangana, crminal cases