A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
Share |
December 11 2018, 2:36 am

దేశ ప్రధానిని ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నిర్ణయం చేస్తారని ఆ పార్టీ ప్రచారం ఆరంబించింది. చంద్రబాబు కుమారుడు , మంత్రి లోకేష్ ఈ ప్రచారం చేస్తున్నారు. దుబాయ్ లో ఆయన పర్యటించారు. తెలుగు రాష్ట్రాలకు బిజెపి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.అందుకే దేశంలోని ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఎమ్.పి స్థానాలను గెలిచి దేశ ప్రధాని ని చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో కట్టుబట్టలతో బయటకు గెంటేశారని...అయినా కష్టపడి, ప్రజల సహకారంతో అభివృద్ధిలో చరిత్ర సృష్టించే దిశగా వెళ్తున్నామని చెప్పారు.

tags : lokesh, pm chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info