A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనగామ నుంచి పోటీ చేయడం లేదు-కోదండ
Share |
December 11 2018, 12:02 am

జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ వనక్కి తగ్గారు. అక్కడ పిసిసి మాజీ అద్యక్షుడు పొ్న్నాల లక్ష్మయ్య రంగంలో ఉండడం, ఆయన బిసి కావడంతో ఆ సీటు తాను తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయని భావించి ఆయన అక్కడ నుంచి పోటీ చేయడం లేదని చెప్పారు.అయితే మరే చోట నుంచి అయినా పోటీచేస్తారా?లేదా అన్నది తెలియదు. కోదండరామ్ ప్రచారానికే పరిమితం కావచ్చని కూడా భావిస్తున్నారు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్‌ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

tags : kodandaaram, janagama

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info