తెలంగాణ కాంగ్రెస్ స్టార్ ప్రచార కర్త విజయశాంతి కూడా ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఆమె మెదక్ నుంచి పోటీచేయాలని భావించారని వార్తలు వచ్చాయి. కాని ఆ సీటును తెలంగాణ జనసమితికి కేటాయించారు.దాంతో ఆమె తాను అసలు పోటీచేయాలని అనుకోవడం లేదని అంటున్నారు. తాను స్టార్ ప్రచారకర్తనని,కాంగ్రెస్ గెలుపుపైనే దృష్టి పెడతానని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడంలేదని వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ కోరినప్పటికీ తానే పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని విజయశాంతి చెబుతున్నారు. tags : vijaysanti, contest