A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సముద్రాలను కంట్రోల్ చేస్తున్న చంద్రబాబు
Share |
December 11 2018, 1:17 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలివి.ట్విటర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు కురిపించారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపానులను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు.



ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు
ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు నాయుడని విజయసాయిరెడ్డి విమర్శించారు. కుల వృత్తులలో మెజారిటీ ప్రజలు బీసీలేనని పేర్కొన్నారు. వారి కోసం దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని చంద్రబాబు అటకెక్కించడంపై మండిపడ్డారు. గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి.. కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలుపెట్టారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కుల వృత్తులలో మెజారిటీ బీసీలే. వారి కోసం వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి. గతంలో పచ్చచొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కుల వృత్తుల వారికి పనిముట్ల పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలెట్టాడు... ప్రలోభాలకు ఆదిగురువైన చంద్రబాబు.

tags : vijayasai, abu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info