A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భూకబ్జా-పోలీసులు- లగడపాటి
Share |
March 25 2019, 6:40 am

భూ కబ్జా విషయంలో విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఒకరికి మద్దతు ఇచ్చిన తీరు వివాదాస్పదం అయినట్లుగా ఉంది.పారిశ్రామికవేత్త జిపి రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళి సోదారలు చేశారు. అయితే వారంట్ లేకుండా ఎలా వస్తారని వారితో లగడపాటి తగాదాకు దిగారు. అంతేకాక వరంగల్ ఐజి నాగిరెడ్డి ఒత్తిడి మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.అయితే జిపి రెడ్డి పై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్య తీసుకుంటుంటే లగడపాటి ఎందుకు అడ్డుపడుతున్నారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.టీవీలలో ఈ వివాదం విషయం ప్రముఖంగా వస్తోంది.దీనిపై ఐజి నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ భూమికి లగడపాటికి ఉన్న సంబందం ఏమిటని ప్రశ్నించారు. తనకు ఈ భూమితో సంబందం లేదని, తన అత్తగారి తల్లి తన అత్తగారి తల్లి కొనుగోలు చేశారని తెలిపారు. పీ రెడ్డి గతంలో ఫోర్జరి డ్యాకుమెంట్లు​ సృష్టించి ఈ భూమి అమ్మే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. విమెక్‌ కో ఆపరేటివ్‌ సోసైటీలోని తమ కుంటుంబ సభ్యుల.. బాధిత సోసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకే బంజారాహిల్స్‌ పోలీసులు జీపీ రెడ్డి ఇంటకి వెళ్లారని అన్నారు.ఈ వివాదంలో ఎవరిది తప్పు,ఒప్పు అన్నది తేలవలసి ఉంది.

tags : lagadapati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info