A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు అత్యధికుల మద్దతు- సర్వే
Share |
July 20 2019, 2:33 am

తెలంగాణలో టిఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది.ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్దతు బాగా పెరిగింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. ఏకంగా 75శాతం మంది ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని,. 44శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని.. 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి క్లీన్‌స్వీప్ చేసే అవకాశముందని సర్వే తేల్చింది. 75శాతం మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌పట్ల సానుకూలంగా ఉన్నారని వెల్లడించింది. కూటమి కట్టినా విపక్షాలను ఓటరు కనీసం ఊసులోకైనా తీసుకోవడం లేదని ఈ శాంపిల్ సర్వే ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణ యం.. విపక్షాలపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని, ఆ శరాఘాతం నుంచి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యా నిం చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 44 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుం దని అభిప్రాయపడగా, 22శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు.
.

tags : telangana, survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info