A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతి
Share |
March 25 2019, 7:15 am

పాతికేళ్ల వయసుకే గుండెపోటు రావడం దురదృష్టకరం. అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ది ఒకరు గుండెపోటుతో మరణించిన వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన భార్గవ్ రెడ్డి అనే ఈ విద్యార్ది ఇటీవలే టెక్సాస్ నుంచి మిన్నియా పోలీస్ నగరానికి మారాడు. అతను ఉద్యోగం అన్వేషించుకునే పనిలో ఉన్నారట.కాని దురదృష్టవశాత్తు ఈ నెల ఏడో తేదీన భార్గవ్ గుండెపోటుకు గురి కాగా అతని స్నేహితులు ఆస్పత్రికి తరలిస్తుండగా ,దారిలోనే మరణించాడని సమాచారం.భార్గవ్ నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. భార్గవ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్‌ రెడ్డి మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

tags : bhargav, died, america

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info