A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ స్టీల్- ఎపి ప్రభుత్వం కొత్త డ్రామా
Share |
April 19 2019, 7:51 pm

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురతానందట. అలాగే ఉంది ఎపి ప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు. కడప స్టీల్ ప్లాంట్ విషయం కాని, విశాఖపట్నంలో మెట్రో రైల్ ఏర్పాటుపై కాని ఎపి మంత్రివర్గం చేసిన నిర్ణయాలు కేవలం ఎన్నికలలో ప్రజలను మభ్య పెట్టడానికి చేసినట్లు ఉంది తప్ప మరొకటి కనిపించడం లేదు.కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తారట. తద్వారా కొందరికి పదవులు ఇస్తారేమో.ఈ కార్పొరేషన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటుందట.కేంద్రం,ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టాలట. రాష్ట్రం కూడా పెట్టుబడి పెడుతుందట.అదేదో ఏ వంద కోట్లో, వెయ్యి కోట్లు అనుకుంటే అది వేరే విషయం.కాని ఎకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అని అంచనా వేశారు. నిజానికి వైఎస్ రాజశేకరరెడ్డి టైమ్ లో ప్రైవేటు రంగంలో స్టీల్ కర్మాగానికి వేగంగా ఏర్పాట్లు చేస్తే ఇదే చంద్రబాబు,టిడిపి నేతలు ఎన్ని విమర్శలు చేశారు..ఎన్ని అడ్డంకులు సృష్టించారు. స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న భూమిలో నెమళ్లు తిరుగుతున్నాయని, అపురూపమైన జంతువులు, పక్షులు ఉన్నాయని తెలుగుదేశం మీడియాలో పిచ్చి రాతలు రాయించారు. 1200 కోట్ల వ్యయం తర్వాత అది ఆగిపోయింది. దానికి కారణం వైఎస్ అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలు. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం అని చెప్పాలి. తర్వాత ఎపి విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ సాధ్యాసాద్యాల పరిశీలన అని పేర్కొన్నారు.ఆ కారణంగా అది సాద్యంకాదని నివేదిక వచ్చిందన్నది కేంద్రం వాదన. బిజెపితో చెడిన తర్వాత కాని కడప స్టీల్ ను టిడిపి భుజనా వేసుకోలేదు.అంతవరకు వైఎస్ ఆర్ కాంగ్రస్,వామపక్షాలు చేసిన ఆందోళలను హైజాక్ చేసి తమ ఎమ్.పి సి.ఎమ్.రమేష్ తో దీక్ష అంకం నిర్వహించి రాజకీయంగా లబ్ది పొందాలని టిడిపి ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా అదేదో తేలికగా అయిపోయే పని మాదిరి పదిహేను వేల కోట్లతో తామే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రచారం చేయాలని నిర్ణయించుకుని తీర్మానం చేశారు. దానికి యధా ప్రకారం తెలుగుదేశం మీడియా అసలు స్లీల్ ప్లాంట్ నిర్మాణం అయిపోయిందేమో అన్నంతగా వార్తలను వండి వడ్డించాయి.నిజంగానే ఎపి ప్రభుత్వానికి అంత శక్తి, ఆలోచన , నిధులు ఉంటే ఈ నాలుగున్నర్రేళ్లు ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టి ,తానేదో చేస్తున్నట్లు ఎన్నికల ముందు పిక్చర్ ఇచ్చి ప్రజలను మాయ చేయాలన్న ఆరాటం ఇందులో కనిపిస్తుంది.వచ్చే నెలలో శంకుస్థాపన చేసినా, చేయకపోయినా, రాష్ట్రం ఆద్వర్యంలో ఇంత పెద్ద కర్మాగారం రావడం అసాద్యం అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఏదైనా ప్రైవేటు సంస్థకు నిజాయితీగా అప్పగించి చేస్తే కొంతలో కొంత నమ్మవచ్చు.అది కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరినో ఒకరిని తెచ్చి డ్రామా చేస్తే అది రాయలసీమ ప్రజలనే కాకుండా, ఎపి ప్రజలందరిని మోసం చేసినట్లే అవుతుంది.ఇక విశాఖ మెట్రో రైలు గురించిన ఆలోచన కూడా అలాగే ఉంది.ఏకంగా ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును రాష్ట్రం చేపడుతుందట.ఎపి ప్రభుత్వం వద్ద అంత డబ్బు ఉంటే కేంద్రం ఇవ్వలేదని రోజూ తిట్టడం ఎందుకు?అంతేకాదు. కోటి మంది ఉన్న హైదరాబాద్ లో సుమారు 16 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో రైలు ఎప్పటికి నష్టాలను అధిగమిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటిది పదిహేను ,ఇరవై లక్షల మంది ఉన్న విశాఖలో అన్ని వేల కోట్లతో ప్రాజెక్టు చేపడితే అది ఎప్పటికి పూర్తి అవుతుంది?దాని నిర్వహణలో ఉన్న కష్టాల సంగతి ఏమిటి?ఇవేవి చెప్పకుండా ఎన్నికల కోసం ప్రజలను మభ్య పెట్డానికి మెట్రో రైల్ అంటే జనం నమ్మితే వారి దురదృష్టం అనుకోవాల్సిందే.ఇలా మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నిలలో ప్రజలను మాయ చేయడానికి వేల కోట్ల స్కీమ్ లను ప్రకటిస్తే నమ్మడానికి జనం అమాయకులు, పిచ్చివాళ్లని టిడిపి ప్రభుత్వం భావన కావచ్చు. నిజంగానే ఆంద్రులు అంత తెలివి తక్కువ వారు అవుతారా?కారనే ఆశిద్దాం.

tags : ap, steel plant

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info