A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దు-మోడీ క్షమాపణ చెప్పాలన్న టిడిపి
Share |
April 19 2019, 7:50 pm

గతంలో నోట్ల రద్దును పెద్ద ఎత్తున సమర్ధించి, అసలు ఐడియా తమదేనని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతోందో చూడండి. ఆ పార్టీ ఎమ్.పి గల్లా జయదేవ్ ప్రకటన ఇది.
...................

బడాబాబులకు మేలు చేసేందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయం- నోట్ల రద్దుతో సాధించిందేమిటి? మోడీ జాతికి క్షమాపణ చెప్పాలిః గల్లా జయదేవ్‌

సరిగ్గా రెండేళ్ల క్రితం నవంబర్‌ 8, 2016న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. ''50 రోజుల గడువు కోరుతున్నాను. డిసెంబర్‌ 30 తర్వాత నా తప్పు ఉందని తేలితే.. మీరు నన్ను ఏ చౌరస్తాలోనైనా నిలబెట్టి, ఏ శిక్ష విధించినా భరిస్తాను'' అంటూ పెద్దనోట్ల రద్దు తర్వాత మోడీ వ్యాఖ్యానించారు. ప్రజలు దీనిని విశ్వసించి.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి మరీ పెద్దనోట్లను మార్చుకున్నారు. రెండేళ్లు అయినా పెద్దనోట్ల రద్దు కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కలగలేదు. నల్లధనం వెలికితీత, ఉగ్రవాదం, తీవ్రవాదంపై పెద్దనోట్ల రద్దు సర్జికల్‌ స్ట్రైక్‌ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించారు. ఆ ప్రయోజనాలు మాత్రం నెరవేరలేదు. నోట్ల రద్దు చెత్త ఆలోచన అని అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేయడం జరిగింది. ఎలాంటి చర్చా లేకుండా, ఆర్బీఐ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బ్యాంకుల్లో తాము దాచుకున్న సొమ్మును తీసుకునేందుకు ప్రజలు రోజుల తరబడి పడిగాపులు కాశారు. 150 మంది క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. ఈ కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకారం నోట్లను రద్దుచేసినప్పుడు రూ.15,41,000 కోట్ల విలువైన రూ.500, 1000 రూపాయల నోట్లు చెలామణిలో ఉండగా.. ఇందులో 15,31,000 కోట్లు తిరిగి వచ్చాయి. అంటే కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. పెద్దనోట్ల రద్దుతో జీడీపీ 2 శాతం తగ్గింది. ఆర్థిక వ్యవస్థకు 3 నుంచి 3.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పెద్దనోట్ల రద్దు వెనుక పెద్ద స్కాం దాగి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఛైర్మన్‌గా ఉన్న అహ్మదాబాద్‌ డీసీసీబీలో రద్దైన నోట్లు భారీగా డిపాజిట్‌ అయ్యాయని తేలింది. మొదటి ఐదు రోజుల్లోనే రూ.745.59 కోట్ల విలువైన నోట్లు డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులో డిపాజిట్‌ అయ్యాయి. అటు గుజరాత్‌ కేబినెట్‌ మంత్రి అయిన జయేష్‌ భాయ్‌ విఠల్‌భాయ్‌ ఛైర్మన్‌గా ఉన్న రాజ్‌కోట్‌ డీసీసీబీలో కూడా రూ.693.19 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్‌ చేశారు. దేశంలో ఉన్న 15,20 మంది ధనవంతులు, అత్యంత అవినీతిపరులు తమ నల్లధనాన్ని మార్చుకోవడానికే పెద్దనోట్లను రద్దు చేశారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన మోడీ ప్రభుత్వం.. వాటి స్థానంలో అంతకంటే పెద్దదైన రూ.2వేల నోటును తీసుకువచ్చింది. మరోవైపు 2015-16 ఏడాదికి బీజేపీ వద్ద 570.86 కోట్లు విరాళాలు ఉండగా.. పెద్దనోట్లు రద్దైన 2016-17 ఏడాదికి 81.18శాతం పెరిగి రూ.1034.27 కోట్లకు చేరింది. ఇదే ఏడాది బీజేపీ.. ఎన్నికల కోసం రూ.606 కోట్లు ఖర్చు పెట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ప్రధాని మోడీ.. జాతికి క్షమాపణలు చెప్పాలి. నేటికీ ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదేనా అచ్చేదిన్‌ అంటే? అస్థవ్యస్థ విధానాలతో కోట్లాది మంది ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్న మోడీకి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

(గల్లా జయదేవ్‌)

గుంటూరు ఎంపీ

జాతీయ అధికార ప్రతినిధి

tags : jayadev, modi, notes, demonitisation

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info