A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశం లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
Share |
July 20 2019, 2:43 am

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో లౌకికశక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరమే ప్రధానిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని.. 1996లో కూడా ఇదేవిధంగా జరిగిందని ఆయన అన్నారు.
జాతీయ స్థాయిలో లౌకిక శక్తులన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను దేవెగౌడ ప్రశంసించి, పూర్తి మద్దతు ప్రకటించారన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొనసాగిస్తూనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడకు ఇబ్బంది లేకుండా చూసుకునేలా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. దేశంలోని అన్ని కీలక వ్యవస్థలను నీరుగార్చారని.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆర్‌బీఐని దెబ్బతీశారని, ఫలితంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని విమర్శించారు.

tags : babu, democracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info