A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మల్లు రవి సీటుకు ఎసరు పెడతారా
Share |
August 21 2019, 9:14 am

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవికి టెన్షన్ పట్టుకుందట.ఆయన జడ్జర్ల నుంచి పోటీచేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. కాని ఈలోగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. సీట్ల కేటాయింపులో జడ్జర్లను టిడిపి కేటాయిస్తారేమోనన్న ఆందోళన ఏర్పడింది.అదే సమయంలో మరో సమస్య కూడా ఎదురవుతోందట. జడ్జర్లలో ఉన్న సామాజిక సమీకరణల రీత్యా అక్కడ రెడ్డి వర్గానికి చెందిన యువకుడికి టిక్కెట్ ఇవ్వాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు.దీంతో రవి ముందుగా తన సీటును ఖరారు చేసుకునే పనిలో ఉన్నారట.సీనియర్ నేత అయిన మల్లు రవి కి టిక్కెట్ వచ్చే అవకాశం ఉన్నా, ఈ సమస్యలు ఆయనను వేధిస్తున్నాయట.ఈలోగా టిఆర్ఎస్ నేత , మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఒక రౌండ్ నియోజకవర్గంలో ప్రచారం పూర్తి చేశారు కాంగ్రెస్ మాత్రం ఇంకా ఆరంభమే చేయలేదు.

tags : mallu ravi, seat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info