A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇవి చంద్రబాబు మార్కు విచారణ నివేదికలు
Share |
March 25 2019, 6:57 am

విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికను వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు.సిట్ నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత డైరెక్షన్ లో తయారైన నివేదిక అని , అది హిజ్ మాస్టర్ వాయిస్ లా ఉందని ఆయన అన్నారు. కుంభకోణంలో విలన్‌ పాత్రధారులైన ‘ఎల్లో మాఫియా గ్యాంగ్‌’లో ఒక్కరి పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ‘మాస్టర్‌’ పట్ల తిరుగులేని విశ్వాసాన్ని సిట్ చాటుకుందని ఎద్దేవా చేశారు‌.రిషితేశ్వరి మరణం, వనజాక్షిపై దాడి, నారాయణ, చైతన్య కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు, పుష్కరాల్లో తొక్కిసలాట, లాంచి ప్రమాదం, రత్నాచల్‌ రైలు దగ్ధం, కాల్‌మనీ రాకెట్‌, విశాఖ భూకుంభకోణం వరకు జరిపిన విచారణల్లో నిజమైన దోషిని ఒక్కరిని పట్టుకోలేదు, శిక్షించలేదని తెలిపారు. ఇవే బాబు మార్క్‌ విచారణలు అని విజయసాయిరెడ్డి ద్వజమెత్తారు.

tags : vijayasai, babu, reports

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info