A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కనకదుర్గమ్మ వారధిపై కన్నా భైటాయింపు
Share |
August 21 2019, 8:38 am

ఎపిలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని బిజెపి అద్యక్షుడు కన్నా లక్మీనారాయణ అన్నారు. తమ ఎమ్మెల్యే పి.మాణిక్యాలరావును తాడేపల్లి గూడెంలో గృహ నిర్భంధం చేశారని,తాను పలకరించడానికి వెళుతుంటే తనను నిలువరించారని ఆయన అన్నారు.దాంతో ఆయన కనకదుర్గమ్మ వారదిపై భైటాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. మాణిక్యాలరావును హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో కోర్‌ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జీవీఎల్‌, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.కన్నా ఇంటి వద్ద కూడా బిజెపి కార్యకర్తలు ఆదోళనకు దిగారు.

tags : kanna, sit,bridge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info