A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై హత్యాయత్నం కేసు- హ:కోర్టు ఆదేశం
Share |
August 21 2019, 8:00 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబందించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.ఇందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరగా, మంగళవారం లోగా ఇవ్వాలని హైకోర్టు సూచించింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సిట్ దర్యాప్తు రిపోర్ట్‌ను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఏపీ ప్రభుత్వం తరపు వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది వినిపించనున్నారు.

tags : hgih court, jagan, case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info