A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెల్లూరు కిసాన్ సెజ్ భూముల్లో టిడిపి దందా
Share |
November 15 2018, 4:48 pm

నెల్లూరు కిసాన్ సెజ్ లోని భూములను ఎపి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో ఈ విషయం ప్రస్తావించారు. పదమూడువేల రూపాయలకు ఎకరాభూమి కేటాయిస్తే,దానిని ఏభై లక్షల రూపాయల చొప్పున అమ్ముకోవడం రియలె ఎస్టేట్ వ్యాపారం కాదా అని ఆయన ప్రశ్నించారు.ఇందులో టిడిపి వారికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్న నెంబర్‌ 94: నెల్లూరు జిల్లాలోని కిసాన్‌ సెజ్‌లో భూకేటాయింపులు, భూములను కేటాయించిన సంస్థలు పరిశ్రమలను ప్రారంభించకపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు పలుమార్లు మీ
ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజం కాదా? ఇందులో కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన 1000 ఎకరాలు ఉన్న మాట వాస్తవం కాదా? దేవుడి భూములు అనే భయం, భక్తి
కూడా మీకు, మీ ప్రభుత్వానికి ? దేవాలయానికి సంబంధించిన ఈ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా, అమ్మోనియా యూరియా ప్లాంట్‌కు కేటాయించిన ఈ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
ఎలా చేస్తున్నదని చీఫ్‌ జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌, ఎస్‌వీ భట్‌ల హైకోర్టు ధర్మాసనం వ్యాక్యానించలేదా? ఎకరం రూ.13 వేల రూపాయలకు ఈ భూములన్నీ కేటాయిస్తే, వాటిని ఎకరం రూ.50 లక్షలకు అమ్మిన
మాట వాస్తవం కాదా? ఈ మొత్తం వ్యవహారంలో మీకు, మీ పార్టీ వారికి ఎలాంటి ముడుపులు అందలేదని ప్రకటించగలరా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా? సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు
చంద్రన్న కానుకల పేరిట ఇస్తున్న సరుకుల సరఫరా బాధ్యత మీ వందిమాగదులకు అప్పగించి, నాసిరకం సరుకులు ప్రశ్నించలేని పేదలకు పంపిణీ చేసి జేబులు నింపుకుంటున్న విషయం వాస్తవం కాదా?
పేదలకు, పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు నిర్దేశించబడిన సంక్షేమ పథకాలు వారికి అందించే విషయంలో విఫలమైన మీ అవినీతి పాలన ఇంకా కావాలా ప్రజలకు?

tags : kanna, nellore sez

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info