A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడప స్టీల్ ప్లాంట్ ‘పొలిటికల్ స్టంట్’!
Share |
January 17 2019, 4:33 pm

కడప స్టీల్ ప్లాంట్ ‘పొలిటికల్ స్టంట్’! అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ రాసిన కదనం ఇది.

రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాలకే బాండ్స్ ద్వారా అత్యధిక వడ్డీతో 2000 కోట్ల రూపాయల అప్పు చేసిన ఏపీ సర్కారు 12000 కోట్ల రూపాయలతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం సాధ్యం అవుతుందా?. అందుకు ఏపీ సర్కారు వద్ద వనరులు అందుబాటులో ఉన్నాయా?. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ సరఫరా, కనెక్టివిటి లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ ఇంత భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. స్లీట్ ఏర్పాటుకు అత్యంత కీలకమైన ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) వనరులు ఎక్కడ ఉన్నాయి?. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంత తేలికైన వ్యవహారం కాదని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఎన్డీయేలో కలసి ఉన్నంత కాలం కడప స్టీల్ ప్లాంట్ గురించి పెద్దగా పార్లమెంట్ లో ప్రస్తావించని టీడీపీ ఎంపీలు..ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రం ఎక్కడలేని ప్రేమ చూపించారు. అయినా వెనకబడిన జిల్లా అయిన కడపలో స్టీల్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉంది.

ఓ వైపు కేంద్రంతో పోరాడుతున్నామని చెబుతూ…చట్టంలో ఉన్న చట్టబద్దమైన హక్కును కూడా వదులుకుని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించటంలోని ఔచిత్యం ఏమిటి?. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టును ఏపీ ప్రభుత్వమే సొంతంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటే అసలు కేంద్రంతో చంద్రబాబు సర్కారు ఘర్షణ పడాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వం చేసుకోగలిగినవి అన్నీ చేసుకుని..మిగతా వాటికి మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకునే వెసులుబాటు చేసుకుంటే ఏ గొడవా ఉండదు కదా?. కానీ ఇదంతా రాజకీయ డ్రామాలో భాగమే. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనతో మమ అన్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కారు. అనంతరం పురం జిల్లాలోని ఓబుళాపురం గనులు ఇప్పడు సీబీఐ కేసు వివాదంలో ఉన్నాయి. అవి తప్ప..రాష్ట్రంలో ఇంత భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే ఖనిజం అందుబాటులో లేదు. అసలు ఓబుళాపురం గనుల్లోని ఖనిజంపై కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి.
ఓ వైపు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటే ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఖనిజ సరఫరా గ్యారంటీ లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ అయినా వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి..ఎందుకు రిస్క్ లో పడుతుంది. అదే కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు తెచ్చుకోగలిగితే ఖనిజ సరఫరా కూడా ఒప్పందం చేసుకునే వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో ఆమోదించినంత మాత్రాన కడప స్టీల్ ప్లాంట్ పరుగులు పెడుతుందనుకుంటే అది పొరపాటే. శంకుస్థాపనకు ముందే ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమలుకు ఏ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంటుందో అన్నది కూడా ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

tags : andhrapradesh, kadapa, steel,drama

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info