A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మాజీ మంత్రి గృహ నిర్భందం
Share |
August 21 2019, 5:49 am

ఎపిలో బిజెపి, టిడిపి నేతల మధ్య ఆయా చోట్ల వివాదాలు సాగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు, తెలుగుదేశం నేత , జడ్పి చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ల మద్య వివాదం నేపద్యంలో వీరిద్దరిని గృహ నిర్భందం లో పోలీసులు ఉంచారు. తాడేపల్లి గూడెం అభివృద్దిపై చర్చ, మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశం తదితర విషయాలపై వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆ నేపధ్యంలో ఇద్దరూ బహిరంగ చర్చకు సవాల్ విసురుకున్నారు. ఆ తర్వాత అందుకు సిద్దం అవుతుండగా,పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి ఇరువురు నేతలను ఎక్కడకు కదలకుండా ఉంచారు. అలాగే మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్దకూడా పోలీసులను పెట్టారు.

tags : ap, x minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info