A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీ కుట్రలపై జవాబివ్వండి-బాబుకు హరీష్ లేఖ
Share |
March 25 2019, 6:38 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయమై ఆయన ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు తో కాంగ్రెస్ పార్టీ ఎలా కలుస్తుందని ఆయన ప్రశ్నించారు.తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఎపిలో కలుపుకోవడం, కాళేశ్వరంపై కేంద్రానికి పిర్యాదు చేయడం, పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేంచడం, సీలేరు ప్లాంట్ ను తెలంగాణకు రాకుండా చేయడం వల్ల 500 కోట్ల నష్టం వచ్చిందని హరీష్ రావు చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చంద్రబాబు ఏకపక్షంగా రద్దు చేశారని ఆయన చెప్పారు. ఎపికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నా చంద్రబాబు వాటిని తెలంగాణకు అప్పగించలేదని ఆయన గుర్తు చేశారు. విభజన గాయం అని చంద్రబాబు పేర్కొన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు ఎపిలో మాత్రం అక్రమ ప్రాజెక్టులను మాత్రం చేపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

tags : harish, chadnrabau, letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info