A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మాజీ ఎమ్మెల్యే రేవూరి- సీటుకై అన్వేషణ
Share |
January 17 2019, 4:35 pm

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి ఏ నియోజకవర్గం టిక్కెట్ ఖరారు అవుతుందో తెలియడం లేదు.గతంలో ఆయన నర్సంపేట నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో ఇండి పెండెంటుగా గెలిచిన దొంతి మాదవరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.దాంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వనున్నారు. దాంతో ప్రకాష్ రెడ్డి వేరే నియోజకవర్గం వెదుక్కోవలసి వచ్చింది. పరకాల సీటు కావాలని ఆయన కోరుకున్నారు. కాని కాంగ్రెస్,టిడిపి పొత్తు పొడిచేలోపు మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఆ టిక్కెట్ హామీని పొందారు.దాంతో రేవూరి ఆ టిక్కెట్ పై ఆశ వదలుకోవల్సి వస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ రావచ్చని ఒక ప్రచారం జరుగుతోంది. ఆ సీటుపై తెలంగాణ జనసమితి నేత ఇన్నారెడ్డి కన్నేశారు. టిజెఎస్ ఆ సీటు కోసం పట్టుబడుతోంది.దాంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.ఇక్కడ నుంచి వరంగల్‌ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ వర్గీయుల్లో అసంతృప్తులు రగులుకుంటున్నాయని కధనాలు వస్తున్నాయి. మొత్తం మీద రేవూరి ప్రకాష్ రెడ్డి కి ఏ టిక్కెట్ దొరుకుందన్నది తేలకుండా ఉందట.కాంగ్రెస్,టిడిపి పొత్తు ఉన్నా,నేతలు టిక్కెట్ల కోసం నానా తంటాలు పడవలసి వస్తోంది.

tags : revuri, tdp,seat,congress

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info