A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంత
Share |
August 5 2020, 5:14 am

కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రబావం చూపుతాయా? కాంగ్రెస్ నేతల కన్నా ముందుగా తెలుగుదేశంపార్టీ ఈ విషయంలో ముందుగా స్పందించడం గమనించదగ్గ అంశమే.సహజంగానే కాంగ్రెస్ కు ఇవి ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే అదే సమయంలో కొన్ని విషయాలు గమనించాలి.సాదారణంగా ఉప ఎన్నికలలో అదికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. గత నాలుగేళ్లలో జరిగిన ఉప ఎన్నికలు, ఆయా రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో అత్యధికం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది.పశ్చిమబెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికలు దాదాపు అన్నిటిలో అక్కడి అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ విజయం సాదించింది.ఆ మాటకు వస్తే డిల్లీలో జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మి పార్టీ గెలిచింది. అయితే రాజస్తాన్ లో జరిగిన ఎన్నికలలో అదికారంలో ఉన్న బిజెపి ఓటమి చవిచూసింది. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా బిజెపి ఓడింది. రాజస్తాన్ లో ప్రభుత్వ వ్యతిరేకత కారణం అయితే, యుపిలో రాజకీయ పార్టీల సమీకరణం కారణంగా కనిపిస్తుంది.ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో ఒక్క ఉప ఎన్నికలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోలేదు.పైగా హైదరాబాద్ వంటి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా 99 సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. అలాగే వరంగల్ లో జరిగినా, చివరికి అచ్చంపేట మున్సిపాల్టీకి ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ దే గెలుపు అయింది.అచ్చం పేటలో అయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమైనా దాదాపు అన్ని వార్డులను టిఆర్ఎస్ కైవలం చేసుకుంది.అంత మాత్రాన టిఆర్ఎస్ కు మహాకూటమి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఇవ్వదని కాదు.కాంగ్రెస్,టిడిపి,సిపిఐ,టిజెఎస్ కూటమి గట్టి పోటీ ఇచ్చి అదికారంలోకి వస్తుందన్నది వారి ఆశ కావచ్చు. కర్నాటక పరిస్థితి వేరు. తెలంగాణ రాజకీయ వాతావరణం వేరు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్,జెడిఎస్ కూటమి అధికారంలో ఉండడం కలిసి వచ్చే పాయింట్.అయినా బిజెపి ఒక లోక్ సభ నియోజకవర్గాన్నినిలబెట్టుకోగలగడం కూడా విశేషమే.కాకపోతే కర్నాటకలో వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ కూటమి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండవచ్చు.దివాకరరెడ్డే ,మరొకరో చెబుతున్న ధీరీ కరెక్టు అనుకుంటే ఉప ఎన్నికలన్నిటిలో టిఆర్ఎస్ గెలిచింది కనుక అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీదే గెలుపు అనుకోవల్సి ఉంటుంది.తెలంగాణలో అయితే ఒక్క ఉప ఎన్నికలో కూడా ఇతర పార్టీ ఏదీ విజయం సాదించలేకపోయింది. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ,టిడిపి కలిసే పోటీచేశాయి. అయినా టిఆర్ఎస్ పక్షాన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాదించారు. సహజంగానే అదికారంలో ఉన్న పార్టీకి ఉప ఎన్నికలో గెలిచే అవకాశం ఉంటుంది.కాకపోతే కర్నాటక అనుభవంతో కొన్ని ప్రాంతీయ పార్టీలలో కొత్త ఆశ ఏర్పడింది.కర్నాటకలో కాంగ్రెస్ కు డెబ్బైకి పైగా సీట్లు వచ్చినా, జెడిఎస్ కేవలం 35 సీట్లకే పరిమితం అయినా, బిజెపిని నిలువరించడానికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రస్ వదలుకుందిఇ.అలాగే కేంద్రంలో కూడా బిజెపి ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ కి, ,కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎ కి కూడా ఆదిక్యత రాకపోతే,ఆ రెండు జాతీయ పార్టీలు కాకుండా జెడిఎస్ నేత కుమారస్వామికి మల్లే ప్రాంతీయ పార్టీకి అయినా చాన్స్ వస్తుందా అన్న ఆశ కొందరిలో ఉంది. పశ్చిమబెంగాల్ లోని మమత బెనర్జీ, బిఎఎస్పి అదినేత్రి మాయావతి వంటి వారు అందుకే రాహుల్ గాందీని ప్రధాని అభ్యర్దిగా అంగీకరించడం లేదు.అలాగే ఫెడరల్ ప్రంట్ ఆలోచన చేసిన ఒక దశలో ప్రదాని అభ్యర్ది ఆ పార్టీ ప్రచారం చేసింది.అలాగే మరికొందరు నేతలు కూడా ఆశల పల్లకిలో ఊగుతుండవచ్చు.తెలంగాణ ఎన్నికల మీద కాంగ్రెస్,టిడిపిలు పెద్ద ఆశలే పెంచుకున్నాయి. అది టిఆర్ఎస్ కు ఒక సవాలు వంటిది. ఇన్నాళ్లు ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో గెలవడం ఒక ఎత్తు అయితే ,టిఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా కీలకమైన ఎన్నికే అవుతుంది. కర్నాటక ఉప ఎన్నికలు కాంగ్రెస్,టిడిపిలకు కొత్త ఆశ కల్పించవచ్చు. ఉప ఎన్నీకల ఫలితాలే గీటురాయితే టిఆర్ఎస్ కు ఎదరులేనట్లే అవుతుంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.

tags : telangana, politics, karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info