A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2019 లో నారాసురుడి రాజకీయ సంహారం
Share |
August 21 2019, 8:00 am

ఎపిలో టిడిపి పాలనలో ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవవస్థలు దిగజారిపోయాయని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నారా పాలన నరకాసురపాలనను తలపిస్తోందని ఆయన అన్నారు. ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. . ఆపరేషన్‌ గరుడ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పోలీస్‌ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్‌ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు. యూపీఎలో చంద్రబాబు కొత్తగా కూడగట్టేదేముందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థను కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఒకటిన్నర లక్షల కోట్ల అ‍ప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు.

tags : anam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info