A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ సరే..;పవన్ వార్డుకు ఎన్నికయ్యారా....టిడిపి ప్రశ్న
Share |
November 15 2018, 4:38 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై పిఠాపురం టిడిపి ఎమ్మెల్యే ఎస్వి ఎస్ ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. పిఠాపురం నుంచి తాను పోటీచేస్తానేమో అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, ఎమ్మెల్యే వర్మ పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించడం వంటి వాటి నేపద్యంలో ఆయన తీవ్రంగా విమర్వలు గుప్పించారు. పవన్‌ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని అన్నారు. అంతేకాక పవన్‌ పరుష పదజాలాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మీ దగ్గర ఏం పని చేశామని బ్రోకర్లం అయ్యామంటూ వర్మ ప్రశ్నించారు. ఏ పార్టీలో అయినా విలీనమయ్యామా? లేక అమ్ముడు పోయామా? అంటూ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెసోళ్ల పంచలు ఊడదీస్తామని భారీ డైలాగులు చెప్పిన పవన్‌ తర్వాత అదే కాంగ్రెస్‌తో చేరిపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్‌పై అనుచిత విమర్శలు చేయనిదే పవన్‌కు నిద్ర పట్టేలా లేదని వ్యాఖ్యానించారు. లోకేష్‌ పంచాయతీ మెంబర్‌ కూడా కాలేదు.. మరి మీరు దేనికి మెంబర్‌ అయ్యారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

tags : tdp, varma, fire

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info