A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
700 కోట్ల పెట్టుబడి-ఎపి ప్రభుత్వ రాయితీ 2300 కోట్లా
Share |
November 15 2018, 3:43 pm

ఎపి ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో లేఖ సంధించారు. 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఒక సంస్థకు 2300 కోట్ల రాయితీలు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇందులో భారీ అవినీతి ఉందని,సిబిఐ విచారణకు అంగీకరించగలరా అని కన్నా సవాల్ చేశారు.కన్నా వేసిన ప్రశ్న ఇలా ఉంది.

ప్రశ్న నెంబర్‌ 93: రాష్ట్రానికి బ్రహ్మాండంగా పెట్టుబడులు తెస్తున్నామని చెప్పేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కంపెనీలకు మీరు ఇస్తున్న రాయితీలు రాష్ట్రానికి నష్టం కలిగించడం లేదని చెప్పగలరా? 12 సంవత్సరాలలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హెచ్‌సీఎల్‌ కంపెనీకి మీరు ఇచ్చిన రాయితీలు రూ.2,223.9 కోట్లు. ముఖ్యంగా వారికి కేటాయించిన 49.86 ఎకరాల విలువే సుమారు రూ.700 కోట్లు. వీటన్నింటిలో ముడుపులు అందలేదని చెప్పగలరా? గొప్ప ఆర్ధిక వేత్తను అని చెప్పుకునే మీరు ‘ రాష్ట్రానికి వచ్చేది ఎంత- రాష్ట్రం ఈ కంపెనీలకు ఇచ్చేది ఎంత’ అని బేరీజు
వేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

tags : kanna,ap, govt, letter

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info