A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ?
Share |
November 15 2018, 3:45 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉందా?ఆయన ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.పిఠాపురం ప్రత్యేకత శ్రీపాద శ్రీవల్లభుడేనని ఆయన ఆశీస్సులుంటే ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమోనని అన్నారు.పిఠాపురం సభలో ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు.అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే పేకాట క్లబ్‌లు నిర్వహిస్తారా అంటూ స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ, సర్పంచిగా కూడా గెలవని లోకేశ్‌కు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఉద్యోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల కోసం హార్బర్‌ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. విలువలున్న నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్‌ అని, ఇప్పుడున్న నేతలు అవినీతి అలవాటుపడ్డారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి ఓట్లు రావు, సీట్లు రావంటూ జోస్యం చెప్పారు.

tags : pawankalyan, pithapuram

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info