వ్యాపారవేత్తలపై ఐటి దాడులు జరిగితే టిడిపినేతలకు ఎందుకు అంత ఉలుకుపాటు అని బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ప్రశ్నించారు. వారు అన్నీ సవ్యంగా నిర్వహించి ఉంటే భయపడాల్సిన అవసరం ఏముందని వ్యాక్యానించారు. కేంద్రం చెప్పినట్లుగా ఐటి అధికారులు చేస్తే, రాష్ట్రంలో జరుగుతున్న ఎసిబి దాడులన్నీ టిడిపి నేతలే చేయిస్తున్నారా అని ప్రశ్నించారు. ఐటి అధికారులు తమ విధులను నిర్వహిస్తున్నారని, టిడిపినేతలపై కక్ష సాధించాల్సిన అవసరం కేంద్రంపై లేదని వ్యాఖ్యానించారు. లేనిపోని ఆరోపణలు చేసి వ్యవస్థలపై ప్రజల్లో చులకన భావం తీసుకురావద్దని కోరారు. tags : somu veerraju on tdp