త్వరలో పలువురు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చాలా మంది టీఆర్ఎస్ సీనియర్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, సమయం రాగానే కాంగ్రెస్‌లోకి మారతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో విరక్తి చెందారన్నారు. మహాకూటమికి కనిష్టంగా 80సీట్లు వస్తాయని, కేసీఆర్‌కు ఇరవై సీట్లు మించే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని ప్రజలు అర్థం చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. tags : sr trs leaders,congress,jump