సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇవాళ కుటుంబసభ్యులతో వెళ్లి గద్దర్ ఢిల్లీలో కలిసారు.తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని రాహుల్ గాంధీని కోరినట్లు గద్దర్ తెలిపారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదేనని గద్దర్ భార్య విమల వ్యాఖ్యానించారు. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ చేయడం సరికాదని గద్దర్ విమర్శించారు. గద్దర్ కుమారుడు సూర్యంకు బెల్లంపల్లి సీటును మహాకూటమి తరపున ఆశిస్తున్నారు. కాంగ్రెస్ వైపు నుంచి ఓకే అయినా ఆ సీటు నుంచి సిపిఐ సీనియర్ నేత గుండా మల్లేష్ ఉన్నారు. దీంతో సురవరం సుధాకర్‌రెడ్డిని కూడా కలిసి తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం సహకరించాలని గద్దర్ కోరినట్లు తెలుస్తోంది. గద్దర్ వెంట కొప్పుల రాజు, మధుయాష్కీ ఉన్నారు. tags : gaddar family,rahul sonia