A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దామోదర్ పద్మినీ రివర్స్‌ గేర్
Share |
December 12 2018, 8:38 am

మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ పద్మినీరెడ్డి రివర్స్‌ గేర్‌తో వార్తల్లో నిలిచింది. ఇవాళ పొద్దున్న బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పద్మినీరెడ్డి బిజెపిలో చేరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో దామోదర్ ఆంధోల్‌లో ఉండటం విశేషం. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు,నేతలంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఏమయ్యిందో ఏమో సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కార్యకర్తల ఆవేదనను అర్థంచేసుకున్నానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తెలిపారు. అయితే పద్మినీ గతంలో సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ఆమె విజ్ఞప్తిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని రాజనరసింహ చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా దామోదర్ వ్యవహరిస్తున్నారు.

tags : damodara padmini,reverse

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info