A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్‌షాని నమ్మలేకపోతున్న టిబిజెపి నేతలు
Share |
October 16 2018, 10:15 pm

అమిత్‌ షాను తమ అనుమానాలతో చిరాకు పెట్టించారు తెలంగాణ బిజెపి నేతలు. కరీంనగర్ సభ ముగిసిన తర్వాత రోడ్డుమార్గం ద్వారా అమిత్‌ షా హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో జరిగిన కీలక సమావేశంలో పార్టీ శ్రేణులంతా గట్టిగా పనిచేయాలని సూచించారు. ఈసారి అధికారమో,ప్రతిపక్షమో దక్కకపోతే తెలంగాణలో బిజెపి ఇక ఎప్పటికీ మెరుగైన స్థానంలో నిలబడలేదని తేల్చేశారు. అయితే కొందరు నేతలు మాత్రం టీఆర్ఎస్‌తో మనం ఎలా వెళ్లాలి సార్..వారితో మనకు రహస్య ఒప్పందం ఉందా అని ప్రశ్నించారట. దానితో మండిపడ్డ అమిత్ షా ఎన్నిసార్లు చెప్పాలి. టీఆర్ఎస్‌తో మనకు ఎలాంటి ఒప్పందాలు లేవు..మీ పని మీరు చేసుకోండి..
నా మాట మీద కూడా మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పాలంటూ చిరాకు పడ్డారట పాపం

tags : amith,bjp,telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info