A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉద్దానం ప్రజావేదన-ఆపన్నహస్తం కోసం చూపు
Share |
November 14 2018, 11:04 am

తితిలీ తుఫాన్ ఉద్దానంపై తీవ్ర ప్రభావం చూపింది.దాదాపు నాలుగుమండలాల్లో ఆకలి కేకలు వినిపించేలా చేసింది. ప్రతి ఇంటికి నష్టం జరిగింది. కొబ్బరి వందశాతం నేలకొరిగింది. జీడిమామిడి చెట్లు పనికిరాకుండా పోయాయి. జీడి పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది. తోటల్లో పశువులు ఎక్కడికక్కడ మృత్యువాత పడ్డాయి. ఉద్దానంలో ఎవరినోట విన్నా హృదయవిదాకర మాటలే..ఎక్కడ చూసిన విషాద దృశ్యాలే.. సామాన్యూలపై కన్నెర్ర చేసింది గాలి దేవుడంటున్నారు. వర్షం అంత లేకపోయినా ఈదురుగాలుల దెబ్బకు ఒక్కచెట్టు మిగిలికపోవడం బాధాకరమే..ఎక్కడికక్కడే రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి పూట ఆగిఉన్న లారీలైతే ముందుకు కదిలిపోయే పరిస్థితి..రైల్వే స్టేషన్లలో షెడ్లు మిగిలలేదు.పలాసలో బీభత్సం..వజ్రపుకొత్తూరు మండలంలో ప్రజానీకం అల్లకల్లోలానికి లోనయింది. పలాస మండలంలో మామిడితోటలు, అరటి , కొబ్బరి తోటలు నేలకొరిగాయి. మందసలో పరిస్థితి భయానీకం,సోంపేట తీరప్రాంతం అట్టుడికిపోయింది. మాతాతల కాలం నుంచి ఇలాంటి గాలులు వీచిన ఘటనే జరగలేదని వయోవృద్దులు వాపోతున్నారు. పూరిగుడిసెలు, పెంకుటిల్లుల్లో ఉన్నవాళ్ల పరిస్థితి ఈరోజు రాత్రికి ఎలా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. మత్స్యకార గ్రామాల్లో ఆందోళన..భయానకం..ఈరాత్రికి పరిస్తితి ఏంటి..తుఫాన్ ఉందా పోయిందా అని అక్కడికి వెళ్లే అధికారులను ప్రజలు అడిగే పరిస్థితి వచ్చిందంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. వచ్చే పదేళ్లు కొబ్బరి, జీడి సంపాదన ఇవ్వదు..బతుకు వెళ్లదీయడం ఎలా అనే ప్రశ్న ఇవాళ ఉద్దానం ప్రజల్లో వచ్చిందంటే నిజంగా ఆ పరిస్తితి అర్థం చేసుకోవచ్చు..ప్రభుత్వం ఆదుకోవాలి ...పాపం పేదవాళ్లు ..ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు..

tags : uddanam,titily,cyclone

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info