A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ సీట్లకు అభ్యర్థులు ఖరారు అయినట్లేనా
Share |
May 22 2019, 5:13 am

టీఆర్ఎస్ ప్రకటించాల్సిన ఆ 14 సీట్లపై దాదాపు ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే అవకాశముందట. తాజా మాజీ ఎమ్మెల్యేలు కనకారెడ్డి, సుధీర్‌రెడ్డి, బొడిగే శోభలకు మొండిచేయి ఖాయమట. తొలుత కనకారెడ్డి కుటుంబం నుంచి సీటు ఇస్తామని చెప్పినా , ఆ తర్వాత కనకారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి, అక్కడి నుంచి మైనంపల్లి హన్మంతరావును బరిలో నిలిపాలని నిర్ణయించారట. మేడ్చల్ నుంచి సుధీర్‌రెడ్డిని పక్కన పెట్టి ఎంపీ మల్లారెడ్డిని బరిలో నిలపాలని అనుకుంటున్నారట. ఇక ఖైరతాబాద్‌లో ఎప్పట్నుంచో పనిచేస్తున్న మన్నె గోవర్థన్‌రెడ్డిని పెట్టాలా లేక ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ ని పెట్టాలన్న దానిపై తర్జనభర్జనలు పడినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అయితే మన్నెను పనిచేసుకోవాల్సిందిగా కోరగా, సిఎం అనుచరవర్గం మాత్రం దానంకే సీటు అని అంటున్నారు. ఒకవేళ దానంకు గోషా మహల్ ఇస్తే మన్నెకు ఖైరతాబాద్ దక్కినట్లే. ఏం జరుగుతుందో చూడాలి.

tags : trs,cong,seats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info