A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి టిక్కెట్లు కేసీఆర్ ఇస్తున్నారా?
Share |
February 24 2019, 12:20 am

తెలంగాణలో బిజెపి టిక్కెట్లు కేసీఆర్ అనుమతితోనే ఇస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అమిత్ షా పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ ముందుగా భద్రతా సిబ్బంది కంటే తొందరగా ఈడీ, ఐటి సిబ్బంది వస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తానంటే మోడీ అమిత్ షాలు సై అన్నారని, షెడ్యూల్ సైతం కేసీఆర్ ఏం చెప్తే అది చేశారని పొన్నం పైర్ అయ్యారు. తెలంగాణలో ఒక్కసీటు గెలవలేని దుస్ధితిలో బిజెపి ఉందని, దాదాపు వంద స్థానాల్లో బిజెపి డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. టిక్కెట్లు దక్కని వారికి, గెలవలేని వారికి, మహాకూటమి అభ్యర్థిల సీట్లు చీల్చేవారికి బిజెపి బి ఫాంలు ఇవ్వబోతుందని జోస్యంచెప్పారు.

tags : ponnam,bjp-trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info