టిజెఎస్ వ్యవస్థాపకులు ప్రొ.కోదండరామే మహాకూటమి కన్వీనర్‌గా కొనసాగనున్నారని సమాచారం. ఇందుకు కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం, సిపిఐ కూడా ఆంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మరో వైపు మహాకూటమి పేరును సైతం ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమిగా మార్చేందుకు కూడా అన్ని పక్షాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమికి కోదండరాం హెడ్ అయితే సీట్ల సర్దుబాట్లు సైతం చూసుకుంటారని, మిగతా వ్యవహారాలవైపు పార్టీలు దృష్టి పెట్టవచ్చునని ఉత్తమ్ ,రమణ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కోదండరాంకు 3సీట్లు, సిపిఐకి 5, టిడిపికి 15 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. అయితే అవి ఎక్కడ ఏంటి అనేది త్వరలో తెలుస్తోంది. tags : kodandaram, mahakutami