A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదండరాం వద్దకు ఎల్‌.రమణ మధ్యవర్తిత్వం
Share |
December 10 2018, 9:25 am

తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరాం వద్దకు టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌.రమణ వెళ్లారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతో కోదండరాం అలకబూనిన సంగతి తెలిసిందే. రెండురోజుల్లో సీట్లు సర్దుబాటు కాకపోతే తాము ఒంటరిగా సీట్లు ప్రకటించడమో, లేదా తమతో కలిసి వచ్చే పార్టీలతో వెళ్లడమో జరుగుతుందని కోదండరాం మహాకూటమి నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాంను బుజ్జగించేందుకు ఎల్.రమణ హుటాహుటిన వెళ్లినట్లు సమాచారం. తొందరలోనే సీట్ల వ్యవహారం కొలిక్కి వస్తుందని, తొందరపడవద్దని కోదండరాంను కోరినట్లు తెలుస్తోంది.

tags : ramana,kodandaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info