A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. సన్నిహితులపై ఐటి దాడులు
Share |
October 16 2018, 10:01 pm

ఎపి పరిశ్రమల మంత్రి అమరనాదరెడ్డి కొత్త విషయం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండేవారిపైన ఆదాయపన్ను దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు.తాము దాడులను వ్యతిరేకించడం లేదంటూనే, దాడులు జరిగిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు.గతంలో కర్నాటక, తమిళనాడులలో కూడా ఇలాగే దాడులు జరిగాయని ఆయన అన్నారు.బెంగుళూరులో జరిగిన టిడిపి వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.ఆయనతో పాటు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2030 నాటికి ఎపిని దేశంలో నెంబర్ ఒన్ చేస్తామని వారు అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తామని వారు చెప్పారు.

tags : tdp, cm, it raids

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info