A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు కంప్యూటర్లతో కూడా అబద్దాలు చెప్పిస్తారు
Share |
October 16 2018, 10:13 pm

ఎపిలో అగ్రీగోల్డ్ బాధితుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్ష నేత జగన్ విమర్శించారు. 1100 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందరిని ఆదుకోవచ్చని ఆయన అన్నారు.చంద్రబాబు ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు.
' ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పారాడా అంటూ చంద్రబాబు ప్రతీసారి అక్కడకు వెళ్తారు. కానీ ఆయన అక్కడ చేసే బాగోతం మాత్రం.. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేటుకు వేలం వేయడానికి బ్రోకరింగ్‌ చేయడానకి అమర్‌సింగ్ అనే వ్యక్తితో మంతనాలు చేస్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు 11 వందలు కేటాయించి వారిని ఆదుకుంటాం. నాలుగేళ్లలో రాష్ట్రంలో పాలన కుంటుపడింది. గతంలో వైఎస్‌ హాయంలో జిల్లాలో 38 వేల ఇళ్లు నిర్మిస్తే.. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు ఊరికి కనీసం ఒక్క ఇళ్లు కూడానిర్మించలేక పోయారు.150 కోట్లతో వైఎస్‌ త్రాగునీరు అందించారు. చంద్రబాబు పేదలకే ఏమీ చేయలేక కేవలం అబద్దాలతోనే నడిపిస్తున్నారు’’ అని అన్నారు.చివరికి కంప్యూటర్లతో కూడా అబద్దాలు చెప్పిస్తారని జగన్ ఎద్దేవ చేశారు.

tags : jagan, babu, computers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info