A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంబులెన్స్‌ వ్యాన్‌ సౌండ్‌ కూ బాబు గజగజ
Share |
February 24 2019, 12:50 am

చంద్రబాబు నాయుడు అంబులెన్స్‌ వ్యాన్‌ సౌండ్‌ విని కూడా పోలీస్‌ వ్యాన్‌ అనుకుని భయంతో గజగజా వణికిపోతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకవైపు ఐటీ అధికారులకి సెక్యూరిటీ ఉపసంహరించుకున్నట్లు చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇవ్వడం..మరో వైపు చంద్రబాబు అనుకూల మీడియా విష ప్రచారం సాగించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు విపత్కరంగా మారాయి..ఐటీ దాడులు జరిగితే ప్రజలకు నష్టమా లేక టీడీపీ నాయకుల నష్టమా స్పష్టంగా చెప్పాలని రాంబాబు కోరారు. దర్యాప్తు సంస్థలంటే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అసలు దర్యాప్తు సంస్థలు దాడులే చేయవద్దు అన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఖర్చులు ఎలా ఉన్నాయో లెక్క తీయాలని ఐటీ సంస్థలను కోరారు.

tags : ambati, ambulence

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info