A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీడియాను ప్రశ్నించిన అంబటి
Share |
December 10 2018, 10:17 am

గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సంస్థలపై ఈడి,సిబిఐ వంటి సంస్థలు దాడి చేసినప్పుడు ఒక వర్గం మీడియా ఏ విధంగా స్పందించింది, ఇప్పుడు ఎపిలో జరుగుతున్న దాడులపై ఎలా రాస్తున్నది వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు విశ్లేషించారు.ఇదే ఈడీ సంస్థ గత ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంస్థల్లో దాడులు నిర్వహించినపుడు ఎల్లో పత్రికలు ఈడీ దాడులను బేష్‌ అన్నట్లు రాశాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలపై ఈడీ దాడులు చేస్తే అవే ఎల్లో పత్రికలు ఎలా రాస్తున్నాయో ప్రజలు గమనించాలన్నారు.ఈడీ పంజా, మోదీ చెబితే దాడి అంటా బ్యానర్‌ హెడ్డింగ్‌లు పెట్టి ఇలా దర్యాప్తు సంస్థల పేరును భ్రష్టు పట్టించేలా రాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని అన్నారు..మరి చంద్రబాబు బయటకొచ్చి కేసీఆర్‌కి ఎందుకు సవాల్‌ చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అంటే చంద్రబాబుకి ఎందుకు భయమన్నారు. టీడీపీ అయినా, చంద్రబాబు అయినా చట్టాలకు లోబడే ఉంటాయని, చట్టాలకు చంద్రబాబు అతీతుడేమీ కాదని వ్యాఖ్యానించారు.

tags : ambati, media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info