A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు మాటలతో జనం విస్తుపోతున్నారు
Share |
December 10 2018, 10:23 am

మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు కేసు వ్యవహారంతో తమకు సంబందం లేనట్లు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డిపై జరుగుతున్న విచారణ, ఐటి అదికారుల సోదాలపై మనకేమి సంబందం అని చంద్రబాబు అంటున్నారని, ఆయనకు తెలియకుండానే ఓటుకు నోటు వ్యవహారం నడించిందా అని భూమన ప్రశ్నించారు. ఆదాయపు పన్ను చెల్లించని వారిపై ఐటీ అధికారులు దాడులు చేయడం సర్వసాధారణమేనని తెలిపారు.
కానీ కొంత మందిపై జరిగిన దాడులను మొత్తం రాష్ట్రంపై జరిగిన దాడిగా సీఎం చంద్రబాబు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్టని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అధికార పార్టీకి అనుకూలంగా తయారు చేసారని విమర్శించారు. ఇప్పుడు ఐటీ అధికారులు అతని అనుచరులపై దాడి చేయడంతో చంద్రబాబుకు భయం మొదలైందన్నారు.

tags : bhumana, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info