A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు ఎమ్.పిలతో తెలంగాణ వచ్చిందా
Share |
December 10 2018, 10:42 am

ఇద్దరు ఎమ్.పిలతో టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చిందా అని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ కుంతియా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని ఆయన అన్నారు. ముషీరాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్‌ పాదయాత్ర ప్రారంభించారు. కుంతియా మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో తెలంగాణ ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ 9 నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్‌ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడిగారు. మోదీ, ఎన్‌డీఏ గ్రాఫ్‌ తగ్గుతోంది..రాహుల్‌ గ్రాఫ్‌ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకుని కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.

tags : congress, trs, mps

Latest News
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info