A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
Share |
October 16 2018, 9:29 pm

తెలంగాణ లో కాంగ్రెస్,టిడిపిల మహాకూటమి ఒప్పందం ఎంత గట్టిగా ఉంటోంద తెలియదు కాని, టిడిపి నేతలు ఏకంగా పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి ,గత ఎన్నికలలో కోదాడ నుంచి గెలుపొందిన పద్మావతి సీటుకే ఎసరు పెడుతున్నారన్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.కోదాడలో పద్మావతి తిరిగి పోటీచేయడానికి సిద్దం అవుతున్నారు.కాని అక్కడ నుంచి పోటీ చేయాని ఆసక్తిగా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్ మహాకూటమి లో భాగంగా టిడిపి నుంచి పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.టిడిపి అదినేత చంద్రబాబు నాయుడును ఈ విషయమై అభ్యర్ధించారు.అలాగే ఉత్తం కుమార్ రెడ్డిని కూడా తనకు సీటు ఇవ్వాలని కోరినట్లు వార్తలు సూచిస్తున్నాయి. కాని ఉత్తం అంగీకరించలేదట.తనకు టిక్కెట్ ఇస్తే బిసి వర్గాల మద్దతుతో గెలుపొందుతానని మల్లయ్య యాదవ్ చెబుతున్నారట.

tags : telangana,uttam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info